Wed Dec 25 2024 06:19:24 GMT+0000 (Coordinated Universal Time)
వర్మ గారూ.. తప్పకుండా కలుద్దాం : మంత్రి పేర్ని నాని
''పేర్ని నాని గారు నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యలకి సంబంధించిన
ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినిమా ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై ఘాటు విమర్శలే చేశారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ..''పేర్ని నాని గారు నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యలకి సంబంధించిన వివరణ ఇస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.
Also Read : ఏపీలో భారీగా పెరుతున్న కరోనా కేసులు
వర్మ ట్వీట్ కు పేర్ని నాని రిప్లై ఇచ్చారు. 'ధన్యవాదములు వర్మ గారు. తప్పకుండా త్వరలోనే కలుద్దాం' అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత పేర్నినాని రిప్లై పై వర్మ స్పందించారు. మంత్రి నాని నుంచి సానుకూల స్పందన వచ్చిందని, అందువల్ల ఇక ఈ అనవసరమైన వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నానని ట్వీట్ చేశారు.
Next Story