Sun Dec 29 2024 01:46:17 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవి వందల సార్లు నాకు ఫోన్ చేశారు
చిరంజీవి టాలీవడ్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు
చిరంజీవి టాలీవడ్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన స్థాయికి తనకు వందల సార్లు ఫోన్ చేశారని నాని తెలిపారు. చిరంజీవి సినిమాలంటే తనకు చిన్నప్పటి నుంచి పిచ్చి అని, ఆయన పోస్టర్లను చూసి మురిసిపోయేవాడినని మంత్రి నాని గుర్తు చేసుకున్నారు.
మెసేజ్ లు పెట్టి....
అలాంటి చిరంజీవి తనకు "నానీ గారు ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడవచ్చా? టైం చెబితే ఆ టైంలో ఫోన్ చేస్తానని అనేకసార్లు మెసేజ్ పెట్టేవారు" అని పేర్ని నాని చెప్పారు. చిరంజీవి తన స్థాయి చూసుకోకుండా తన కోసం ఇన్ని సార్లు ఫోన్ చేశారంటే ఇండ్రస్ట్రీ సమస్యలను పరిష్కరించడం కోసమేనని పేర్ని నాని తెలిపారు. మూవీ టిక్కెట్ల ధరలను ప్రభుత్వం తగ్గించిన వెంటనే చిరంజీవి ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారన్నారు. ఆయనను తొలిసారి కలిసిన తర్వాత ప్రభుత్వం ఆలోచన కూడా అర్థమయిందని, అందుకే ఆయన సమస్యల పరిష్కారం కోసం మరింత చొరవ చూపారని పేర్ని నాని ఒక టీవీ డిబేట్ లో చెప్పారు.
పెద్ద హీరోలను మాత్రమే.....
కేవలం పెద్ద హీరోలను మాత్రమే పిలిచామని, వారు తమ సినిమాల కోసమే జగన్ వద్దకు వచ్చారన్న వాదన కూడా అర్థం లేదని చెప్పారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళిలు ఈ సినిమాతో తమ కెరీర్ ను ముగించుకుని ఇంటికి వెళతారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. వారంతా చనిపోయేంత వరకూ సినిమా రంగంలో ఉండాలనుకునే వారని పేర్ని నాని అన్నారు.నా స్థాయి వ్యక్తితో చిరంజీవి అన్ని సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
Next Story