Mon Dec 23 2024 23:59:45 GMT+0000 (Coordinated Universal Time)
బాధపడుతున్నాం కానీ.. ఈ దొంగ ఏడుపులేంటి?
ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించినంత మేర సాయం చేయలేకపోయినందుకు బాధపడుతున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించినంత మేర సాయం చేయలేకపోయినందుకు బాధపడుతున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మొత్తంగా జీతం పెరిగిందా? లేదా? అన్నది చూడాలన్నారు. కొందరు పీఆర్సీపై విషప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ, బీజేపీలు గత ఐదేళ్లు వేధించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏం ఒరిగిందన్నారు. టీడీపీ ఐదేళ్లు ప్రభుత్వం నడిపిందని, అప్పుడు ఉద్యుగులపై కేసులు పెట్టడం నిజం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
కొందరు కావాలని.....
ఉద్యోగుల ఆందోళనలకు కొందరు సందట్లో సడేమియాలా బయలుదేరారన్నారు. టీడీపీ, బీజేపీ లు ఐదేళ్ల పాటు ఏం చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు పెద్దగా రావడం లేదని పేర్ని నాని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలని పేర్ని నాని కోరారు. ఉద్యోగులు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్రంతో పాటు పేద ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని పేర్ని నాని కోరారు.
Next Story