Mon Dec 23 2024 14:24:43 GMT+0000 (Coordinated Universal Time)
అదంతా అబద్ధం...మోహన్ బాబు పిలిస్తేనే వెళ్లా
మోహన్ బాబు ఆహ్వానం మేరకే తాను ఆయన ఇంటికి వెళ్లానని మంత్రి పేర్నినాని తెలిపారు
మోహన్ బాబు ఆహ్వానం మేరకే తాను ఆయన ఇంటికి వెళ్లానని మంత్రి పేర్నినాని తెలిపారు. నిన్న జరిగిన టాలీవుడ్ ప్రముఖులతో జగన్ సమావేశం చర్చల వివరాలను తాను వివరించడానికి వెళ్లలేదని పేర్ని నాని చెప్పారు. కొన్ని మీడియాల్లో అలా వార్తలు వచ్చాయని, అవి వాస్తవ విరుద్ధమని తెలిపారు. తాను మోహన్ బాబు పిలిస్తేనే ఆయన ఇంటికి వెళ్లానని తెలిపారు. మోహన్ బాబు తనను కాఫీకి ఆహ్వానిస్తే వెళ్లానని చెప్పారు.
చంద్రబాబుది అసూయ....
అంతేతప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెళ్లి చెప్పే పరిస్థితి ఉండదని పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోరన్నారు. చంద్రబాబు ఓర్వలేకనే టాలీవుడ్ చర్చలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు సినిమా ఇండ్రస్ట్రీకి ఉపయోగపడ్డారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. సినీ ఇండ్రస్ట్రీని ఇబ్బంది పెట్టింది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. ఆయన చూపిన వివక్షత గురించి గుణశేఖర్ ను అడిగితే చెబుతారని పేర్ని నాని తెలిపారు. ఓర్వలేని తనంతో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నించారని అన్నారు. చంద్రబాబు ఈర్ష్య, అసూయలతో మాట్లాడుతున్నారన్నారు.
Next Story