Mon Dec 23 2024 15:31:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్
మంత్రి పినిపె విశ్వరూప్ ఏపీలో పనిచేస్తున్న వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి జీతాల పెంపుపై ఆయన స్పష్టత ఇచ్చారు
మంత్రి పినిపె విశ్వరూప్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి జీతాల పెంపుపై ఆయన స్పష్టత ఇచ్చారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాన్ని ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచుతామని మంత్రి విశ్వరూప్ తెలిపారు.
సీఎం సానుకూలమే...
ఇందుకు ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. అయితే ఈ ఏడాదిన్నర కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి సూచించారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క వాలంటీర్ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగించే ప్రమాదముందని మంత్రి వారిని హెచ్చరించారు.
Next Story