Mon Dec 23 2024 04:30:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
సమగ్ర కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
సమగ్ర కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు తెచ్చింది కాదని పొన్నం ప్రజలకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక, దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమేనని ఆయన తెలిపారు.
బీసీల గురించి....
బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్న పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలైన బావాబామర్దులే మాట్లాడుతున్నారన్నారు. ఇద్దరూ ప్రజలను బెదరిస్తున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Next Story