Mon Dec 23 2024 07:49:35 GMT+0000 (Coordinated Universal Time)
బాలకృష్ణ మీసాలు మెలేయడంపై స్పందించిన రోజా
ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న వ్యవహారంపై వైసీపీ నేత రోజా
ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న వ్యవహారంపై వైసీపీ నేత రోజా స్పందించారు. బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడని విమర్శలు గుప్పించారు రోజా. నేను బాలకృష్ణకు సూటిగా చెబుతున్నా.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు కాదని మంత్రి రోజా అన్నారు.
పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని అన్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్ విసిరేసి, బాటిల్స్ పగలగొట్టి నానా హంగామా సృష్టించారని తెలిపారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉందని ఆరోపించారు మంత్రి రోజా. తన తండ్రి ఎన్టీఆర్కు అవమానం జరిగినప్పుడు బాలయ్య ఎందుకు స్పందించలేకపోయాడు. ఇప్పుడు బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నారని అన్నారు రోజా. బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడని అన్నారు. తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మీ నియోజకవర్గం సమస్యలపై ఫైటింగ్ చేశారా? అని మీడియా ముందు ప్రశ్నలు అడిగారు రోజా. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ అనే విషయాలను టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు రోజా.
News Summary - minister rk roja comments on nandamuri balakrishna
Next Story