Mon Dec 23 2024 07:02:25 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా.. కూతురు ఇండస్ట్రీ ఎంట్రీపై వ్యాఖ్యలు
"యాక్టింగ్ కెరీర్ ఎంచుకోవడం తప్పు అని ఎప్పుడూ అనను. నా కూతురు, కొడుకు గనుక యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే..
ఏపీ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కేరోజా నేడు తిరుమలకు విచ్చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కూతురు ఇండస్ట్రీ ఎంట్రీపై వినిపిస్తున్న వార్తలపై స్పందించారు. "యాక్టింగ్ కెరీర్ ఎంచుకోవడం తప్పు అని ఎప్పుడూ అనను. నా కూతురు, కొడుకు గనుక యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురుకి బాగా చదువుని సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను బాగా చదువుకుంటోంది. ఇప్పటివరకైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ఒకవేళ తను సినిమాల్లోకి వస్తే మాత్రం ఓ తల్లిగా ఆశీర్వదిస్తాను, అండగా నిలబడతాను" అని చెప్పారు.
మంత్రి రోజా కి అన్షుమాలిక, కృష్ణలోహిత్ అనే కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరూ బాగా చదువుకుంటున్నారు. అన్షు చిన్నప్పటి నుండే సామాజిక సేవలపట్ల ఆకర్షితురాలై ఓ స్వచ్చంద సంస్థకు సహాయసహకారాలు అందిస్తోంది. రోజా బాటలోనే అన్షు కూడా అడుగువేస్తుందని, త్వరలోనే ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. దానిపైనే మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు.
Next Story