Fri Apr 04 2025 16:01:18 GMT+0000 (Coordinated Universal Time)
మండలిలో మంత్రి వ్యాఖ్యలు దుమారం – వైసీపీ సభ్యుల అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ శాసనసమండలిలో మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఆంధ్రప్రదేశ్ శాసనసమండలిలో మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే తాను ఏ వర్గాన్ని కించపర్చే విధంగా మాట్లాడలేదని, కించపర్చే విధంగా మాట్లాడానని భావిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగించవచ్చని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
సభ వాయిదా...
అయినా వైసీపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. మంత్రి సత్యకుమార్ ఆ వర్గానికి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.మంత్రి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ దీనిపై అభ్యంతరం తెలిపారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి మాట్లాడినదాంట్లో అభ్యంతరాలుంటే రికార్డులనుంచి తొలగించవచ్చని సూచించారు.దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలుంటే రికార్డుల నుంచి తొలగిస్తానని ఛైర్మన్ తెలిపారు. అయినా సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
Next Story