Mon Dec 15 2025 04:08:43 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : బటన్ నొక్కి సోమరిపోతులను చేశారు.. మంత్రి వ్యాఖ్యలు.. మండలిలో గందరగోళం
మంత్రి సవిత శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి

మంత్రి సవిత శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గత ప్రభుత్వ హయాంలో బటన్ నొక్కడం వల్లనే జనం సోమరిపోతుల్లా మారిపోయారన్నారు. గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారని సవిత అన్నారు. అందువల్లే శాంతిభద్రతలు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో క్షీణించాయని తెలిపారు. దీంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
వైసీపీ నేతల అభ్యంతరం
మంత్రి సవిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజలను కించపర్చే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే మరో మంత్రి బాలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ మంత్రి సవిత వ్యాఖ్యలలో తప్పేమీ లేదని సమర్థించడంతో వైసీపీ సభ్యులు పోడియంవైపు దూసుకు వచ్చారు. దీంతో సభను ఛైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు.
Next Story

