Mon Dec 23 2024 20:31:12 GMT+0000 (Coordinated Universal Time)
అప్పలరాజుకు అరుదైన అవకాశం
బడ్జెట్ ను శాసనమండలిలో ప్రవేశ పెట్టే అవకాశాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు దక్కించుకున్నారు.
బడ్జెట్ ను శాసనమండలిలో ప్రవేశ పెట్టే అవకాశాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2022-23 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను అప్పలరాజు ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
11న బడ్జెట్....
ఈ నెల 11వ తేదీన ఏపీ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. తనకు అరుదైన అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి సీదిరి అప్పలరాజు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story