Sat Dec 28 2024 01:59:51 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు మంత్రి అప్పలరాజు కౌంటర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి కక్కుర్తి పడి నిన్న రణస్థలంలో సభను పెట్టారన్నారు. అడవిలో సింహాన్ని ఎవరూ రాజును చేయలేదని, జగన్ కూడా అంతేనని అన్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని కాపులను, అభిమానులను అమ్మేస్తున్నాడన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈ సభ జరిగిందన్నారు. కల్యాణ్ పేరును సార్థకం చేసుకునేలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నావని సీదిరి అప్పలరాజు ఆరోపించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం తొమ్మిది షిప్పింగ్ హార్బర్లు కట్టిస్తున్నారన్నారు.
బట్టలూడదియ్యడమంటే....
నువ్వు సభ పెట్టిన కొద్ది దూరంలోనే హార్బర్ వస్తుందని, దాని ప్రారంభోత్సవానికి నిన్ను ఆహ్వానిస్తామని అప్పలరాజు పవన్ కల్యాణ్ కు సూచించారు. అవగాహన లేకుండా మాట్లాడటం ఒక్క పవన్ కే చెందిందన్నారు. అసలు మత్స్యకారుల సమస్యల పట్ల నీకు ఏం అవగాహన ఉందని ఆయన ప్రశ్నించారు. ఎంతసేపూ ఊడిగం చేస్తూ బతకడమేనా? అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజకీయాల్లో నాయకుడు స్ఫూర్తి నింపే మాటలు యువతకు చెప్పాలి కాని, ప్యాకేజీ మాటలు కాదన్నారు. రాజకీయాల్లో బట్టలూడదీయడటమంటే రెండు చోట్ల పోటీ చేసిన నిన్ను ఓడించడమేనని అన్నారు. అదే వైఎస్ ఉన్న పార్టీలో నీ సోదరుడు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు.
Next Story