Sun Dec 14 2025 18:10:38 GMT+0000 (Coordinated Universal Time)
బెయిల్ కోసం ఇన్ని డ్రామాలా? : చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టులను తాను చూశానన్నారు. ఒక వైద్యునిగా తాను మెడికల్ రిపోర్టులను పరిశీలించానని ఆయన తెలిపారు. చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని హైదరాబాద్ లోని ఏఐజీ వైద్యులు నివేదిక ఇచ్చారన్నారు.
కంటి ఆపరేషన్ చేస్తారా?
గుండె జబ్బులు ఉన్నాయన్నది నిజమైతే.. ఏఐజీ వైద్యుల నివేదిక కరెక్టే అయితే ఏ డాక్టర్ కూడా చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయరని మంత్రి సీదిరి అప్పలరాజు అననారు. కేవలం స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ పొందాలనే ఈ నివేదికలు ఇచ్చినట్లు ఉందన్నారు. బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story

