Mon Dec 15 2025 04:14:37 GMT+0000 (Coordinated Universal Time)
ఎక్కువ పరిశ్రమలను తీసుకురావడమే లక్ష్యం : టీజీ భరత్
సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లో మంత్రి టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు

పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లో మంత్రి టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్లో పూజలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్నూలును పారిశ్రామికంగా...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ నుంచి వచ్చినవాడిగా తనకు అవగాహన ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో పరిశ్రమ వర్గాలు భయాందోళనలు ఎదుర్కొన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీరప్రాంతం, వనరులు ఉన్నాయని, తాను, లోకేష్ కలిసి పరిశ్రమల రంగాన్ని పరుగులు పెట్టిస్తామని టీజీ భరత్ తెలిపారు. కర్నూలునూ పరిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు.
Next Story

