Sat Dec 28 2024 21:00:48 GMT+0000 (Coordinated Universal Time)
Ushasri Charan : నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా
మంత్రి ఉషశ్రీ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను పెనుకొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు
మంత్రి ఉషశ్రీ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కలసి వచ్చిన తర్వాత ఈరోజు ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఉషశ్రీ చరణ్ కల్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధిష్టానం నుంచి తనకు పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులను చూసి కాకుండా జగన్ ను చూసి మాత్రమే ఓట్లు వేస్తారని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు.
జగన్ ఆదేశాలతో...
తాను పెనుకొండ వెళ్తున్నానని, కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారని ఉషశ్రీ చరణ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. జగన్ ఆదేశాలను తాను పాటిస్తాననని చెప్పారు. ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు తనను ఎంతో ఆదరించారని, వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు జరిగిందని ఉషశ్రీ చరణ్ తెలిపారు. తాము ఎక్కడికి వెళ్లినా.. ఒక్కటే నినాదం.. అది జగన్ నినాదమని అన్నారు. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ని, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారని పేర్కొన్నారు.
Next Story