Mon Dec 23 2024 12:45:50 GMT+0000 (Coordinated Universal Time)
రాధా రెక్కీపై వెల్లంపల్లి హాట్ కామెంట్స్
వంగవీటి రాధా హత్యకు రెక్కీపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు
వంగవీటి రాధా హత్యకు రెక్కీపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. రెక్కీ ఎవరు చేశారో రాధా చెప్పాలన్నారు. ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో రాధా వెళ్లకూడదని అన్నారు. టీడీపీ హయాంలో రంగా ఎందుకు ధర్నా చేశారో? ఎందుకు హత్య జరిగిందో రాధాకు తెలుసా? అన వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాధా వేరే పార్టీకి చెందిన వ్యక్తి అయినా రెక్కీ విషయం చెప్పగానే వెంటనే స్పందించింది ముఖ్యమంత్రి జగన్ అని ఆయన అన్నారు.
రెక్కీ ఎవరు చేశారు?
వంగవీటి రాధా ఇల్లు మెయిన్ రోడ్డులోనే ఉంటుందని, సందులోకి వచ్చి రెక్కీ ఎవరు చేశారో చెప్పాలన్నారు. హత్యకు రెక్కీ జరిగిందని రాధా చెబుతున్నారని, అయితే ప్రభుత్వం పంపిన గన్ మెన్లను ఎందుకు తిరస్కరించారో రాధా చెప్పాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజకీయం చేయొద్దని, చంద్రబాబు ట్రాప్ లో పడి లేనిపోని ఆరోపణలు చేయవద్దని వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు.
Next Story