Thu Apr 24 2025 00:54:46 GMT+0000 (Coordinated Universal Time)
చర్చలు విఫలం... ఇక సమ్మెకే
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు విఫలమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈరోజు జరిగిన చర్చలలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. తాము మంత్రుల కమిటీ ముందు మూడు డిమాండ్లు ఉంచామని, వాటిపై కూడా స్పందన రాలేదన్నారు. తాము ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణకు కట్టుబడి ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
తమ డిమాండ్లను....
తమ పై ప్రభుత్వం ప్రజల్లో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము ఉద్యమించడానికే సిద్దంగా ఉన్నామని చెప్పారు. పాత జీతాలు కావాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు చర్చల్లో తాము పెట్టిన పెట్టిన డిమాండ్లు సాధించుకునేందుకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Next Story