Mon Dec 23 2024 13:42:16 GMT+0000 (Coordinated Universal Time)
రచ్చకెక్కిన ప్రేమ.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై కొట్లాట !
వాడు నావాడు అంటే.. కాదు నా వాడు అంటూ.. జుట్టూ జుట్టూ పట్టుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. తిట్టరాని తిట్లన్నీ తిట్టేసుకున్నారు. ఇదంతా చూస్తున్న జనంలో ఒకరు పోలీసులకు
ప్రేమ గుడ్డిది అంటారు.. కానీ ప్రియుడి కోసం రోడ్డెక్కి కొట్టుకునేంత గుడ్డిదని ఈ యువతులు నిరూపించారు. ప్రేమ వ్యవహారం రచ్చకెక్కింది. ప్రియుడి కోసం ఇద్దరు మైనర్ బాలికలు రచ్చ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ యువతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. ప్రేమించిన వ్యక్తికోసం ఇద్దరు మైనర్ యువతులు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే పరస్పరం బూతులు తిట్టుకున్నారు.
వాడు నావాడు అంటే.. కాదు నా వాడు అంటూ.. జుట్టూ జుట్టూ పట్టుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. తిట్టరాని తిట్లన్నీ తిట్టేసుకున్నారు. ఇదంతా చూస్తున్న జనంలో ఒకరు పోలీసులకు సమాచారమివ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు యువతుల్నీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. బాలికల తల్లిదండ్రులను పిలిపించి విషయం తెలిపారు. అనంతరం ఇద్దర్నీ వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపారు.
Next Story