Sun Nov 17 2024 16:37:08 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు వీడిన రాధిక మిస్సింగ్ మిస్టరీ.. ఆమె ఎక్కడికి వెళ్లిందంటే..?
తాను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, నర్సింగ్ విద్యార్థిని కాదని రాధిక
రాధిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబాన్ని ఎక్కడలేని బాధ వెంటాడుతూ వచ్చింది. మా కూతురు ఎక్కడ ఉందో చెప్పాలని అధికారులను ఆమె తల్లిదండ్రులు వేడుకున్నారు. అయితే కనిపించకుండా పోయిన ఆమె మావోయిస్టులలో చేరినట్లు తాజాగా తెలిసింది. బుధవారం నాడు మావోయిస్ట్లలో చేరినట్లుగా ఓ లేఖను మీడియాకు విడుదల చేయడంతో రాధిక కనిపించకుండా పోయిందన్న విషయంపై మిస్టరీ వీడింది. తాను కనిపించకుండా పోయాననే వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. నేను మావోయిస్టులతో కలిసి పని చేస్తున్నానని రాధిక నుండి లెటర్ వచ్చింది. రాధిక రాసిన లేఖలో 'నేను అదృశ్యం కాలేదు, మావోయిస్టుల్లో చేరాను' అని రాసి ఉంది. ఇటీవల సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించిన ఎన్ఐఏ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాయని కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు.
తాను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, నర్సింగ్ విద్యార్థిని కాదని రాధిక స్పష్టం చేసింది. "నేను మొదట మహిళా హక్కుల కోసం చైతన్య మహిళా సంఘంలో చేరాను, కాని తరువాత మావోయిస్టుల భావజాలం వైపు ఆకర్షితురాలినయ్యాను" అని రాధిక చెప్పారు. తాను మేజర్ (20)గా ఉన్నప్పుడు మావోయిస్టుల్లో చేరానని, తన ఇష్టాల గురించి ఎవరూ ప్రశ్నించకూడదని ఆమె తెలిపారు. పెదబయలు పోలీస్ స్టేషన్లో రాధిక తల్లిదండ్రులు కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నా తల్లిదండ్రులను పోలీసులు, ఎన్ఐఏ తీవ్రంగా వేధించిందని, అందుకే మీడియాకు లిఖితపూర్వక లేఖ ద్వారా వివరణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నానని రాధిక తెలిపారు.
Next Story