Sun Dec 14 2025 05:54:01 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే ఆళ్ల సంచలన కామెంట్స్
రాజకీయాల్లో ఉంటే జగన్‌తోనే ఉంటా లేకుంటే వ్యవసాయం చేసుకుంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు

రాజకీయాల్లో ఉంటే జగన్‌తోనే ఉంటా లేకుంటే వ్యవసాయం చేసుకుంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న దుష్ప్రచరాన్ని కొట్టి పారేశారు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, వైసీపీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నానని లేనిపోని కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
జగన్ ను వీడను...
కానీ తాను జగన్ కుటుంబంలో ఒక సభ్యుడిలాంటి వాడినని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నిన్నటి గడపడగడపకు ప్రభుత్వం సమీక్ష కార్యక్రమానికి హాజరు కాలేదని, అంతేతప్ప తాను జగన్ ను వదిలి వెళ్లే వాడిని కాదన్నారు. పార్టీలేదు.. బొక్కా లేదు అన్న టీడీపీ నేతలను వదిలేసి, తాను వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాకుంటే రాద్ధాంతం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి వివరించారు. తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని, మంగళగిరిలో వచ్చే ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Next Story

