Mon Dec 23 2024 10:38:25 GMT+0000 (Coordinated Universal Time)
రెండు నెలల్లో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం : ఆనం
వెంకటగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
వెంకటగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాపూరు కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మరో రెండు నెలల్లో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. అందరం సంఘటితం కావాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. వెంకటగిరి టీడీపీకి బలమైన నియోజకవర్గమని, గత మున్సిపల్ ఎన్నికలలో ఎంతో కష్టపడితే రెండు వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చిందన్నారు.
నాలుగో కృష్ణుడు వచ్చాడు...
సమస్యలను పరిష్కరించలేనప్పుడు పదవులు ఎందుకు అని ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించాలని కోరడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. రోడ్లు పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారైందని అన్నారు. రాపూరు నుంచి వెంకటగిరి వెళ్లడానికి రెండున్నర గంటల సమయం పడుతుందని, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేని ఆనం అన్నారు. నన్ను వద్దనుకుని వెంకటగిరిలో వేరే వాళ్లను పెట్టారని, ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చాడని ఆయన ఎద్దేవా చేశారు. మూడేళ్ల నుంచి వెంకటగిరికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపారు.
Next Story