Mon Dec 23 2024 08:59:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కలెక్టర్ వద్దకు బాలకృష్ణ
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అఖిలపక్ష నేతలతో కలసి జిల్లా కలెక్టర్ ను కలవనున్నారు. వినతి పత్రాన్ని సమర్పించనున్నారు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అఖిలపక్ష నేతలతో కలసి జిల్లా కలెక్టర్ ను కలవనున్నారు. వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాని అఖిలపక్ష నేతలతో కలసి కలెక్టర్ ను నేడు బాలకృష్ణ కలవనున్నారు. నిన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ప్రదర్శన, మౌనదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే.
హిందూపురాన్ని....
నిన్ననే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన బాలకృష్ణ ఈరోజు కలెక్టర్ కు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. సత్యసాయి జిల్లాగా పేరు ఉంచినా హిందూపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. హిందూపురానికి జిల్లా కేంద్రం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రం కోసం అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా నిన్న బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story