Mon Dec 23 2024 04:52:05 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన భేటీ.. బాలినేని పార్టీ మారుతున్నారా ?
ముఖ్యం తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలినేని ఖండించారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని, తనకు పార్టీ..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక భేటీ ముగిసింది. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. సీఎంతో ఏయే విషయాలపై చర్చించారో వెల్లడించారు. ముఖ్యం తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలినేని ఖండించారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని, తనకు పార్టీ మారే ఆలోచన లేదని బాలినేని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీఎం జగన్ కు వివరించినట్లు వెల్లడించారు.
ప్రోటోకాల్ అనేది పెద్దవిషయం కాదన్న బాలినేని.. దానిపై సీఎం కు ఫిర్యాదు చేసేంత ఏం ఉంటుందని ప్రశ్నించారు. అలాగే.. రీజినల్ కో-ఆర్డినేటర్ పదవిపైనా చర్చ జరగలేదన్నారు. గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశానని ఆయన గుర్తు చేశారు. తన నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని జగన్ చెప్పారని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారని బాలినేని శ్రీనివాస్ వెల్లడించారు. కాగా.. బాలినేని పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెలరోజుల క్రితం బాలినేని సీఎంతో సమావేశమవ్వగా.. నేడు మరోసారి ఆయన సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story