Sun Dec 22 2024 23:47:43 GMT+0000 (Coordinated Universal Time)
న్యాయరాజధానితోనే సీమ ప్రగతి
కర్నూలును న్యాయ రాజధానిని చేయడం ద్వారా రాయలసీమ మరింత ప్రగతిని సాధిస్తుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు
కర్నూలును న్యాయ రాజధానిని చేయడం ద్వారా రాయలసీమ మరింత ప్రగతిని సాధిస్తుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమకు శ్రీ సిటీ తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. కర్నూలుకు హైకోర్టు సాధనే లక్ష్యంగా ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం జరిగిందని భూమన తెలిపారు.
సీమకు బాబు ద్రోహం...
రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని భూమన ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అన్ని ప్రాంతాల ప్రజలు మద్దతిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాయలసీమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నేత వైఎస్ జగన్ అని ఆయన ప్రశంసించారు. రాయలసీమకు అన్యాయం చేసే ఎవరినైనా క్షమించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, ఇకపై అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
Next Story