Mon Dec 23 2024 09:41:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేలు వీరే
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కట్టారు. ఏడో జాబితాపై కసరత్తు ప్రారంభమయింది.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కట్టారు. ఏడో జాబితాపై క్యాంప్ కార్యాలయంలో కసరత్తు ప్రారంభమయింది. అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరుగుతుండటంతో విజయవాడలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా కొందరు మంత్రులు ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. మంత్రులు కొట్టు సత్యనారాయణ, చెన్నుబోయిన వేణుగోపాల్ వచ్చారు. వీరితో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న నేతలు చర్చించినట్లు చెబుతున్నారు.
అక్కడి నేతలతో...
వీరితో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చి నేతలతో చర్చించారు. అయితే ఎవరెవరితో ఏ విషయాలపై చర్చించారన్న దానిపై చర్చించాల్సి ఉంది. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం ఏడో జాబితాను విడుదల చేసే పనిలో ఉంది.
Next Story