Mon Dec 23 2024 19:48:43 GMT+0000 (Coordinated Universal Time)
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నూజివీడు నేతలు
తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు
తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. ఈరోజు తోట త్రిమూర్తులతో పాటు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఎనిమిదో జాబితాపై వైసీపీ అధినాయకత్వం కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో వీరి రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
ముద్రబోయిన చేరుతుండటంతో....
అయితే ఈరోజు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీలో చేరుతుండటంతో వారిని క్యాంప్ కార్యాలయానికి పిలిచినట్లు సమాచారం. నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా పార్థసారధి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయనను ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలను రచించాలన్న దానిపై జగన్ నూజివీడు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story