Mon Dec 23 2024 11:56:29 GMT+0000 (Coordinated Universal Time)
అది నిజంగా జగన్ గొప్పతనమే
వైెఎస్ జగన్ పై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య హాట్ కామెంట్స్ చేశారు
వైెఎస్ జగన్ పై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఇంటికి వెళ్ళడానికి సిద్దమని ఆయన అన్నారు. కడపలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యంగా పొత్తులు కుదిరాయన్న సి.రామచంద్రయ్య గత ఐదేళ్ల నుంచి సామాన్యుల జీవితాలను దుర్భరం చేశారురన్నారు. ఇన్ని వైఫల్యాలు ఉన్న జగన్ ప్రజల్లోకి రావడం నిజంగా జగన్ గొప్పతనమేనని ఎద్దేవా చేశారు. జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. జగన్ సిగ్గుతో తలదించుకోవాలన్న సి. రామచంద్రయ్య జగన్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని, జగన్ తో పొత్తు అంటే భయపడిపోతున్నారని అన్నారు.
అవినీతిలో పుట్టిన...
అవినీతిలో పుట్టిన పార్టీ వైసీపీ అన్న సి. రామచంద్రయ్య రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సాదించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాటి సాధన కోసమే పొత్తులు. ఏర్పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారని, సింహాలు అడవుల్లో ఉండాలని, ప్రజల్లో కాదన్నారు. తప్పు ఎత్తి చూపించే వారిని పక్కన పెట్టి భజనపరులను దగ్గర పెట్టుకోడం కాదన్నారు. 22మంది ఎంపీలు ఇస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అగ్రకులాలను ఎందుకు తిరస్కరించారన్న సి. రామచంద్రయ్య ఎస్సీ ల బలహీనతలను స్వప్రయోజనాలకు వాడుకొంటున్నారని విమర్శించారు. జగన్ ను జనం ఇంటికి పంపడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Next Story