Sun Dec 14 2025 01:41:13 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : జగన్ తోనే నా ప్రయాణం.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ
వైసీపీని తాను వీడుతునట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తెలిపారు

వైసీపీని తాను వీడుతునట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరాలని ప్రయత్నిస్తున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
వైసీపీని వీడటం లేదు...
తాను వైసీపీని వీడటం లేదని పండుల రవీంద్ర బాబు తెలిపారు. తన విషయంలో జరుగుతున్న ప్రచారమంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. ప్రజలు ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. జగన్ తోనే తన ప్రయాణమన్న పండుల రవీంద్ర బాబు, దేశంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేసింది జగన్ అని ఆయన అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. దళితులకు కూడా పెద్దపీట వేసిన జగన్ ను తాను వదిలే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. పార్టీని వదిల వెళ్లే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Next Story

