Mon Dec 23 2024 17:22:41 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనలో వంశీకృష్ణ యాదవ్కు కీలక పదవి
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు జనసేన పార్టీ అధినేత బంపర్ ఆఫర్ ఇచ్చారు
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు జనసేన పార్టీ అధినేత బంపర్ ఆఫర్ ఇచ్చారు. విశాఖ జనసేన అధ్యక్షుడిగా నియమించారు. జిల్లా బాధ్యతలను వంశీకృష్ణ యాదవ్ చూసుకుంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికార ప్రకటన చేసింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
చేరిన వెంటనే...
అయితే ఆయన చేరిన వెంటనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో జనసేన పార్టీ వ్యవహారాలన్నింటినీ ఆయనే చూసుకుంటారని జనసేన తెలిపింది. దీంతో పార్టీలోకి కొత్తగా వచ్చిన వంశీకృష్ణ యాదవ్కు కీలక పదవిని జనసేన కట్టబెట్టినట్లయింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుు వంశీకృష్ణ యాదవ్ పవన్ తో కలసి యువరాజ్యంలో పనిచేశారు. అందుకే ఆయనకు అంత ప్రయారిటీ లభించిందంటున్నారు.
Next Story