Sun Dec 14 2025 03:51:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఒంగోలులో మాక్ పోలింగ్... రీ చెకింగ్
నేడు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు

నేడు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రీకౌంటింగ్ కోసం వైైసీపీ తరుపున పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేశారు. ఇందుకు అవసరమైన మొత్తాన్ని చెల్లించారు. దీంతో ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్ తో పాటు రీ చెకింగ్ చేసేందుకు కూడా అనుమతించింది.
అనమానం వచ్చి...
అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లు పోలయినా ఎక్కువ ఓట్లు నమోదవ్వడంతో అనుమానం వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమకు అనుకూలమైన పోలింగ్ కేంద్రాల్లో కూడా మెజారిటీ రాకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చి రీకౌంటింగ్ కు బాలినేని కోరారు.
Next Story

