Mon Dec 23 2024 01:52:07 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న కోతి.. సాక్షాత్తు అంజన్న దేవుడే వచ్చాడని..
విజయనగరం : ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో.. ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీరామనవమి రోజున ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించి స్వామి వారి కల్యాణం అయ్యేంతవరకూ అక్కడే ఉండి.. కనులారా కల్యాణాన్ని తిలకించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సాక్షాత్తు ఆంజనేయస్వామివారే వచ్చి కల్యాణాన్ని తిలకించారని వీడియో చూసిన భక్తులు భావిస్తున్నారు. కోతి ఇంట్లో తిరుగుతున్నా ఆ ఇంటి యజమానులు కళ్యాణం ఆపకుండా, కోతిని తరిమి కొట్టకుండా కళ్యాణం కొనసాగించారు. శ్రీరామనవమి రోజు ఈఘటన జరగటంతో అందరూ సాక్షాత్తు హనుమంతుడే స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
Next Story