Tue Jan 07 2025 04:07:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పోలి పాడ్యమి వేడుక
కార్తీక మాసం ముగిసింది. నేడు పోలి పాడ్యమి వేడుక జరుగుతుంది.
కార్తీక మాసం ముగిసింది. నేడు పోలి పాడ్యమి వేడుక జరుగుతుంది. తెల్లవారు జామునే మహిళలు ఏపీ, తెలంగాణలోని నదుల్లో స్నానమాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. పోలి పాడ్యమి సందర్భంగా దీపాల వెలుగుల కాంతులతో విజయవాడ కృష్ణానదిలో, రాజమండ్రిలో గోదావరి నదిలో ఎక్కువ మంది మహిళలు వచ్చి దీపాలు వెలిగించారు. కార్తిక మాసం ముగింపు సందర్భంగా పోలి స్వర్గం వస్తుందని భావిస్తారు.
కార్తీక మాసం ముగింపు సందర్భంగా...
కార్తిక మాసం నెలరోజులపాటు పుణ్యస్నానాలు చేసిన భక్తులు కార్తిక మాసం ముగింపును మార్గశిర శుద్ధ పాడ్యమిగా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి పంపిన భక్తులు, నదీ స్నానం చేసి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి భక్తులు నదిలో వదిలారు పోలి సందర్భంగా భవానీ జల శంకర ఆలయం, పాత శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Next Story