Mon Dec 23 2024 13:55:49 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కోటి రూపాయల టిక్కెట్ చెల్లిస్తే స్వామి వారిని తనివి తీరా?
కోటి రూపాయల సేవా విలువైన టిక్కెట్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న విషయాన్ని మాత్రం ఎక్కువ మంది భక్తులకు తెలియదు.
కలియుగ వైకుంఠంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దగ్గర నుంచి ఎక్కువ సేపు దర్శించుకోవాలని అందరూ ఆశపడుతుంటారు. అయితే అందుకు టీటీడీ ఇప్పటి వరకూ కొన్ని ప్రత్యేక టిక్కెట్లను కేటాయించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ తో పాటు మూడు వందలు, ఐదు వందలు, కల్యాణోత్సవం, శ్రీవాణి టిక్కెట్లు వంటివి కొనుగోలు చేస్తే శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. అయితే కోటి రూపాయల సేవా విలువైన టిక్కెట్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న విషయాన్ని మాత్రం ఎక్కువ మంది భక్తులకు తెలియదు.
కొందిరికే సాధ్యం...
ఎందుకంటే కోటి రూపాయలు ఒక టిక్కెట్ కొనుగోలు చేయాలంటే కొందరికే సాధ్యమవుతుంది. అందిరికీ ఆర్థిక పరిస్థితి సపోదు. అయితే ఈ సేవా టిక్కెట్ ను గనుక మనం కొనుగోలు చేస్తే చాలు జీవితాంతం శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశముంటుంది. ఈ టిక్కెట్ ను కొనుగోలు చేసిన వారు ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ వరకూ పూజలను దగ్గరుండి చూడవచ్చు. శ్రీవారికి జరిగే అన్ని కైంకర్యాలను కూడా వీక్షించే సౌకర్యం ఉంది.
శుక్రవారం మాత్రం...
ఈ కోటి రూపాయల సేవా టిక్కెట్ ను 1980లో ప్రవేశపెట్టినా పోటీ పెరగడంతో కొన్నాళ్లపాటు నిలిపివేశారు. తిరిగి 2021లో ఈ కోటి రూపాయల టిక్కెట్ ను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. వారంలో ఆరు రోజులకు కోటి రూపాయలు కాగా, శుక్రవారం మాత్రం కోటిన్నర అవుతుంది. ప్రస్తుతం ఈ సేవా టిక్కెట్లు 347 అందుబాటులో ఉన్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారానికి సంబంధించి అన్ని టిక్కెట్లు ముందుగానే భక్తులు బుక్ చేసుకున్నారు. ఏడాదిలో నచ్చిన రోజున టిక్కెట్ ను బుక్ చేసుకుని స్వామి వారిని తనివి తీరా దర్శించుకునే వీలుంది.
Next Story