Sat Mar 22 2025 08:48:00 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం !
విశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లా

విశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి.. వారిని కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరు పిల్లలు అప్పటికే మృతి చెందారు. తల్లిని ప్రాణాలతో కాపాడగలిగారు.
ఈ ఘటనలో మృతులు భాను (5), పృథ్వీ (3) లుగా గుర్తించారు. ఇద్దరు పసిబిడ్డల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా ఉన్న ఆ పసివాళ్లను చూసి.. ఊరంతా కంటతడి పెట్టుకుంది. కాగా.. వివాహిత ఆత్మహత్యాయత్నం చేయాల్సిన అవసరం ఏమై ఉంటుంది ? భర్త వేధింపులా ? అత్తింటి వేధింపులా ? లేక మరే ఇతర కారణాలున్నాయా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story