Mon Dec 23 2024 05:36:52 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కార్యాలయానికి ఎంపీ అవినాశ్.. విచారణ ప్రారంభం
ఇప్పటికే సీబీఐ అధికారులు 248 మంది నుండి వాంగ్మూలాలు సేకరించారు. ఆయా వాంగ్మూలాల ఆధారంగానే సీబీఐ అధికారులు..
వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించిన నేపథ్యంలో.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాదితో కలిసి వచ్చిన అవినాశ్ రెడ్డి నేరుగా కార్యాలయంలోకి వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభం కాగా.. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ బృందం అవినాశ్ ను ప్రశ్నిస్తోంది.
వివేకా కేసులో అవినాశ్ సీబీఐ విచారణకు రావడం ఇదే తొలిసారి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు 248 మంది నుండి వాంగ్మూలాలు సేకరించారు. ఆయా వాంగ్మూలాల ఆధారంగానే సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన అనుచరులు సీబీఐ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు.
ఇదిలా ఉండగా.. తాజాగా వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఐదుగురికి సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన ప్రధాన ఛార్జ్ షీట్, అనుబంధ చార్జ్ షీట్ లను విచారణకు స్వీకరించింది. ఐదుగురు నిందితులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సమన్లను జారీ చేసింది. వీరంతా ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.
Next Story