Mon Dec 23 2024 05:48:52 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య జరిగిన రోజు ఇదీ జరిగింది : అవినాష్ రెడ్డి సంచలన వీడియో
సీబీఐ విచారణలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయన్న అవినాష్.. వివేకా రాసిన లేఖలో డ్రైవర్ ప్రసాద్ తనను చచ్చేలా కొట్టాడని..
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో వివేకా హత్య జరిగిన రోజు ఇదీ జరిగిందంటూ వెల్లడించారు. ప్రజలందరికీ ఈ విషయం తెలియాలనే వీడియో విడుదల చేస్తున్నట్లు అవినాష్ తెలిపారు. వివేనా చనిపోయిన రోజు ఉదయం 6.30 గంటలకు తనకు శివప్రకాష్ రెడ్డి నుండి ఫోన్ వచ్చిందన్నారు. అప్పటికే జమ్మలమడుగులో జీకే కొండారెడ్డిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఉండటంతో తాను జమ్మలమడుగు బయల్దేరానని, పులివెందుల రింగ్ రోడ్డులో ఉండగా శివప్రకాష్ ఫోన్ కాల్ రావడంతో.. అర్జెంటుగా వివేకా ఇంటికి చేరుకున్నానన్నారు.
అక్కడికి వెళ్లేసరికి పీఏ కృష్ణారెడ్డి ఉన్నారని, బాత్రూమ్ లో ఆయన డెడ్ బాడీ ఉన్నట్లు పీఏ చెప్పాడన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని అడిగితే లేదని చెప్పారు. వివేకా చనిపోవడానికి ముందు రాసి లెటరు, ఫోన్ ఉండగా.. వాటిని దాచి ఉంచాలని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పాడని అవినాష్ ఈ వీడియోలో పేర్కొన్నారు. సీబీఐ విచారణలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయన్న అవినాష్.. వివేకా రాసిన లేఖలో డ్రైవర్ ప్రసాద్ తనను చచ్చేలా కొట్టాడని, ప్రసాద్ ను వదిలిపెట్టొద్దని ఉందన్నారు. ఆయన చివరిగా రాసిన ఆ లెటర్ ను దాచి ఉంచాలని రాజశేఖర్ రెడ్డి చేప్పాడన్నారు. ఇదంతా తాను వివేకా ఇంటికి వెళ్లకముందే జరిగిందన్నారు. ఈ కేసులో వివేకా రాసిన లేఖే ఎవిడెన్స్ అని, తండ్రి రాసిన చివరి లేఖనే నమ్మరా ? అని వివేకా కూతురు సునీతను ఉద్దేశించి అవినాష్ మాట్లాడారు.
లెటర్ ను ఎందుకు దాచి ఉంచారని సునీత, రాజశేఖర్ రెడ్డిలను అడిగితే అతను చాలా మంచివాడు అని, అతను అలా చేసి ఉండడనే దాచి పెట్టామని సీబీఐ విచారణలో చెప్పారన్నారు. సీబీఐ సునీత-రాజశేఖర్ లకు చాలా స్పేస్ ఇస్తోందని అవినాష్ అన్నారు. ముందు ఇచ్చిన స్టేట్ మెంట్ ను మళ్లీ అలా అనలేదని కవర్ చేస్తున్నారని అవినాష్ యద్దేవా చేశారు. ఎవరిని కాపాడటం కోసం ఆ లెటర్ ను దాచిపెడుతున్నారు ? అని ప్రశ్నించారు.
Next Story