Mon Dec 23 2024 13:26:25 GMT+0000 (Coordinated Universal Time)
అప్పు చేసైనా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే
అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. తీర్పును ఆయన స్వాగతించారు.
అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. తీర్పును ఆయన స్వాగతించారు. అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఉద్యమానికి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్, సుజనాచౌదరి వంటి వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తక్కువ ఖర్చుతో మంచి రాజధానిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కృషి చేశారని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దానిని పట్టించుకోలేదన్నారు.
అమరావతిని.....
అమరావతిని ఎవరూ కొంచెం కూడా కదపలేరని తాను ముందే చెప్పానని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని, హైకోర్టు చెప్పినట్లు మూడు నెలల్లో రైతులందరికీ ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో సుప్రీంకోర్టుకు వెళితే ఇంకా దెబ్బలు పడతాయని ఆయన వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. అప్పు చేసైనా అమరావతని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
Next Story