Mon Dec 23 2024 07:42:04 GMT+0000 (Coordinated Universal Time)
ఎప్పుడు రాజీనామా చేస్తానో చెప్పిన రఘురామ
తాను రాజీనామా చేయడం ఖాయమని, ఉపఎన్నికల్లో విజయం సాధించడం వంద శాతం జరుగుతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు
తాను రాజీనామా చేయడం ఖాయమని, ఉపఎన్నికల్లో విజయం సాధించడం వంద శాతం జరుగుతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనకు నరసాపురం ప్రజలందరూ అండగా ఉంటారని ఆయన తెలిపారు. తాను ఉప ఎన్నికల్లో ప్రత్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి గానే భావిస్తానని, ఎవరూ వైసీపీ నుంచి పోటీ చేసినా తనకు పిల్లకాకి అని ఆయన చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు.
వైసీపీ ఓటమి ఖాయం....
ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, జగన్ కు అప్పుడు తన విలువేంటో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, తుదికంటా పోరాటమే తనకు చిన్న నాటి నుంచి తెలిసిన విషయమని రఘురామకృష్ణరాజు తెలిపారు. పార్టీలకతీతంగా తనకు ఉప ఎన్నికల్లో మద్దతు లభిస్తుందని చెప్పారు. జరిగిన అన్యాయాన్ని దేశమంతా తెలియజేయాలంటే అద్భుత మైన విజయాన్ని సాధించాలని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఫిబ్రవరి ఐదు తర్వాత తన రాజీనామా ఉంటుందని తెలిపారు.
Next Story