టీడీపీ రాజకీయ పార్టీనే కాదు : విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. విజన్ 2020 అయిపోయింది.. ఇప్పుడు విజన్ 2047 అంటూ కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు.. ఇవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. 2047 వరకూ చంద్రబాబు అసలు ఏ పరిస్థుతులలో ఉంటారో అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడానికి అప్పడప్పడూ ఇటువంటి విజన్ డాక్యూమెంట్స్ విడుదల చేస్తారని అన్నారు. 2024తో చంద్రబాబు కథ ముగుస్తుంది.. ఆయన కల చెదిరిపోతుందని.. ఆయన కన్నీరుతో శేష జీవితం గడపవలసిన పరిస్థితి వస్తుందని జోష్యం చెప్పారు.
టీడీపీ రాజకీయ పార్టీనే కాదన్నారు. టీడీపీ అనేది తెలుగు డెకాయిట్ పార్టీ అని అన్నారు. పోలీసుల మీద, వయవస్థల మీద దాడి చేసే ఆ పార్టీని ప్రజలు ఏ రోజు కూడా మన్నించరన్నారు. అసాంఘిక వ్యక్తులకు, కార్యకలాపాలకు సపోర్ట్ చేస్తుంది కాబట్టే టీడీపీ రాజకీయ పార్టీనే కాదన్నారు. టీడీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ఈ మధ్య పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతన్నారని విమర్శించారు. చంద్రబాబు.. ఒకసారి టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేలు చూడాలని అన్నారు. 24 కానీ, 25 కానీ పార్లమెంట్ స్థానాలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేల ద్వారా తెలిసిపోయిందన్నారు.