Mon Dec 23 2024 19:41:56 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు విచారణకు రాలేను : సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సీబీఐ ఎదుట వైసీపీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ఎదుట వైసీపీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాల్సిందిగా సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసింది. అయితే మంగళవారం పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున తాను ఈరోజు హాజరు కాలేనని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
ఐదు రోజల తర్వాత...
ముందుగానే రూపొందించుకున్న షెడ్యూల్ ప్రకారం తాను ఈరోజు మాత్రం విచారణకు హాజరుకాలేనని, ఐదు రోజుల తర్వత ఎప్పుడు పిలిచినా వచ్చి విచారణకు సహకరిస్తానని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ఒకరోజు ముందుగా లేఖ పంపడం వల్ల ముందుగా అరేంజ్ చేసుకున్న కార్యక్రమాలను రద్దుచేసుకుని రాలేకపోతున్నానని తెలిపారు. కాగా నిన్న పులివెందులలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన సీబీఐ అధికారులు అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి కార్యాలయంతో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు.
Next Story