Mon Dec 23 2024 07:20:51 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada Padmanabam:వైసీపీలో ముద్రగడ చేరేది అప్పుడే!!
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
Mudragada Padmanabam:కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి రాబోతున్నారు. ఇది దాదాపు ఖాయంగానే కనిపిస్తూ ఉంది. ఆయన జనసేనలోకి వెళ్ళబోతున్నారంటూ ప్రచారం సాగగా.. అయితే పవన్ కళ్యాణ్ ముద్రగడను కలవలేదు. ముద్రగడా కలవాలని అనుకున్నా కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపాలని భావిస్తూ ఉన్నారు. మార్చి 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్, ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. ఇరువురు కీలక విషయాలు చర్చించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముద్రగడ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ముద్రగడను పార్టీలోకి సీఎం జగన్ తరపున ఆహ్వానించారు మిథున్ రెడ్డి. వైసీపీలో చేరడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, పోటీ చేసే స్థానం విషయంలో కూడా గెలుపు ఓటములను అంచనావేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. సిద్ధం సభలో జాయినింగ్ పెట్టుకుందామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ముహూర్తం బట్టి చూద్దామని ముద్రగడ చెప్పినట్టుగా వైసీపీ నేతలు తెలిపారు.
Next Story