Sun Dec 22 2024 22:03:35 GMT+0000 (Coordinated Universal Time)
ముద్రగడకు షాకిచ్చిన కూతురు.. ఇదేం ట్విస్ట్?
ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కూతురు శ్రీమతి క్రాంతి వ్యతిరేకించారు.
ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కూతురు శ్రీమతి క్రాంతి వ్యతిరేకించారు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు. ఈ విషయంలో ముద్రగడ పద్మనాభాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
తాను పవన్ కే మద్దతు అంటూ...
పిఠాపరంలో పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని ఆయన ప్రకటించారని, ఈ కాన్సెప్ట్ ఏంటో తనకు అర్థం కావడం లేదని క్రాంతి అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ నేతలు వదిలేయడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. తాను మాత్రం పిఠాపురంలో పవన్ కు మద్దతుగా నిలబడతానని చెప్పారు.
Next Story