వీడు మాములోడు కాదు.. ఇతని పేరుపై 658 సిమ్ కార్డులు
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే గతంలో వివిధ టెలికం కంపెనీలు కొత్త సిమ్ కార్డులపై
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే గతంలో వివిధ టెలికం కంపెనీలు కొత్త సిమ్ కార్డులపై ఉచిత బ్యాలెన్స్ తో పాటు వ్యాలిడిటీ సదుపాయం ఎక్కువ ఇస్తుండేవి. ఆ సమయంలో చాలా మంది చాలా సిమ్ కార్డులను తీసుకుంటూ వాడిన తర్వాత పక్కనపడేసేవారు. అలాగే ఒకరి పేరుపై ఎన్నో సిమ్ కార్డులు పొందేవారు. తర్వాత ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఒకరి పేరుపై కేవలం 9 సిమ్ కార్డులు తీసుకునే విధంగా నిబంధనలు విధించింది. అయితే సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కావాల్సిందే. ఆధార్ లేనిది ఏ పని జరగని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ పెరిగిపోవడంతో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక అసలు విషయానికొద్దాం.. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదిక ప్రకారం.. ఏపీలో ఒకే ఆధార్ కార్డులపై 658 సిమ్ కార్డులను ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అవన్ని సిమ్ కార్డులో ఒకే ఆధార్ తో లింక్ అయినట్లు గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఈ సిమ్ కార్డు పోలుకొండ నవీన్ పేరుతో రిజిష్టర్ అయినట్లు గుర్తించారు. అయితే ఇన్ని సిమ్ కార్డులు ఉండటంతో వాటిని రద్దు చేయాలంటూ పోలీసులు సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాశారట. అయితే నేరగాళ్లు ఇలా మీకు తెలియకుండా కూడా మీ ఆధార్‌పై సిమ్ కార్డులు తీసుకునే అవకాశం ఉంది. వారు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మీ వద్ద లేని సిమ్ కార్డులు మీ ఆధార్‌పై ఉన్నట్లయితే వెంటనే బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. లేకపోతే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. లేకపోతే మీ పేరుపై ఉన్న నంబర్ ను వాడుకుంటూ మోసాలకు పాల్పడుతుంటారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులు మాత్రంమే తీసుకునేందుకు అనుమతి ఉంది. అందుకే మీ పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు ఉన్నాయో తనిఖీ చేయడానికి DoT వెబ్సైట్ అందుబాటులో ఉంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వెబ్సైట్ కి లాగిన్ చేయడం ద్వారా వినియోగదారు తన పేరుతో జారీ చేసిన సిమ్ కార్డ్‌ల సంఖ్యను తెలుసుకోవడమే కాకుండా, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్‌ను బ్లాక్ ను బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది.
మరి మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవడం ఎలా?
ముందుగా మీరు http://tafcop.dgtelecom.gov.in/ లాగిన్ అయిన తర్వాత వినియోగదారునికి రెండు లింక్‌లు కనిపిస్తాయి. మీ పోగొట్టుకున్న/దొంగిలించిన మొబైల్‌ని బ్లాక్ చేయడం, సిమ్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు మరో లింక్ కనిపిస్తుంది. రెండవ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుని 10-అంకెల మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయడం ద్వారా మీ పేరుపై ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. పైగా మీకు అవసరం లేని వాటిని బ్లాక్ చేసుకోవచ్చు.