Sun Dec 22 2024 16:15:50 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : విశాఖ వైసీపీ కార్యాలయానికీ నోటీసులు
విశాఖ లోనూ వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
విశాఖ లోనూ వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విశాఖలోని ఎండాడ లోని సర్వే నంబర్ 175/4 లో రెండు ఎకరాలలో స్థలం లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు నిర్మాణం కోసం తీసుకోలేదన్నారు.
అనుమతులు తీసుకోకుండా...
జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్డీఏ కు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడం పై టౌన్ ప్లానింగ్ అధికారులు వివరణ కోరారు. వారం రోజుల లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటించారు.
Next Story