Thu Apr 24 2025 09:03:17 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే ఏడాది నుంచి అమరావతి నిర్మాణ పనులు
రాజధాని నిర్మాణం కోసం ఇంకా భూములు సేకరించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు

రాజధాని నిర్మాణం కోసం ఇంకా భూములు సేకరించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దాదాపు 3,550 ఎకరాలను సేకరించాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. సీఆర్డీఏపై చంద్రబాబు సమీక్ష చేసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అందుకోసం 930 కోట్ల రూపాయలు అవసరమవుతుందని తెలిపారు.
మరో 3,550 ఎకరాలు...
వచ్చే నెల 15వ తేదీలోగా అమరావతి రైతులకు కౌలు మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈలోపు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.
Next Story