Mon Dec 23 2024 10:38:20 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : రైతులకు గుడ్ న్యూస్.. రాజధాని నిర్మాణంపై నారాయణ కామెంట్స్
రాజధాని అమరావతిని రెండున్నరేళ్లలో నిర్మిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
రాజధాని అమరావతిని రెండున్నరేళ్లలో నిర్మిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత రాజధాని నిర్మాణమమేనని ఆయన చెప్పారు. ఈరోజు సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణం చేేపడతామని తెలిపారు. కొన్ని న్యాయపరమైన ఇబ్బందులను కూడా తొలగిస్తామని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేరుస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారమే....
మాస్టర్ ప్లాన్ గతంలో రూపొందించినట్లుగానే ఉంటుందని అందులో ఎలాంటి మార్పు ఉండదని నారాయణ తెలిపారు. అన్నీ ఆలోచించి ఆనాడు మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అందులో మార్పులు చేయాల్సిన పనిలేదని నారాయణ అభిప్రాయపడ్డారు. రైతులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. దీంతో పాటు రాజధాని రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకునేలా యాక్షన్ ప్లాన్ ను పదిహేను రోజుల్లోగా సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని చెప్పారు.
Next Story