Fri Nov 22 2024 17:07:35 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ
రాజధాని లో టిడ్కో గృహ సముదాయాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు.
రాజధాని లో టిడ్కో గృహ సముదాయాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మందడం,దొండపాడు లో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఎ కమిషనర్, టిడ్కో ఎండీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామని, వీటిలో 4 లక్షల 54 వేల 704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. 2019 నాటికి 77 వేల 371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయిందని, లక్షల 13 వేల 842 ఇళ్లును వైసీపీ ప్రభుత్వం 2 లక్షల 62 వేల 216 కు తగ్గించేసిందని ఆరోపించారు.
టిడ్కో ఇళ్లను....
వైసిపి ప్రభుత్వం కేవలం 90 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. వచ్చే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని, ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా వైసీపీ ప్రభుత్వం వాడేసిందన్నారు. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారన్నారు. . టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కొరతామని ఆయన తెలిపారు.
Next Story