Mon Dec 23 2024 07:20:47 GMT+0000 (Coordinated Universal Time)
మునిసిపల్ అధికారుల నిర్వాకం.. ఇంటిపన్ను కట్టలేదని..
ఎప్పుడూ రూ.1600 వచ్చే ఇంటిపన్ను ఈసారి.. ఏకంగా రూ.6400 వచ్చిందని తెలిపారు. పన్ను చెల్లించేందుకు గడువు ఇవ్వాలని కోరినా ..
పిఠాపురం : ఇంటిపన్ను కట్టలేదని మునిసిపల్ అధికారులు ఇంట్లో మనుషులు ఉండగానే తాళాలు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తూ.గో.జిల్లా పిఠాపురంలో వెలుగుచూసింది. ఇంటిపన్ను కట్టలేదని అధికారులు ఇలా చేస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. పిఠాపురంలోని మోహన్ నగర్ లో పన్ను వసూళ్లకు వెళ్లిన అధికారులు గొర్రెల సత్తిబాబు, రమణ ఇళ్లకు వెళ్లారు. పన్ను చెల్లించని కారణంగా.. ఇళ్లలో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు.
దాంతో సత్తిబాబు ఇంట్లో మహిళలు ఆందోళన చేయడంతో తాళాలు తొలగించి.. సీలును మాత్రం అలానే ఉంచి వెళ్లిపోయారు. ఇంటిపన్ను విషయమై సత్తిబాబు మాట్లాడుతూ.. ఎప్పుడూ రూ.1600 వచ్చే ఇంటిపన్ను ఈసారి.. ఏకంగా రూ.6400 వచ్చిందని తెలిపారు. పన్ను చెల్లించేందుకు గడువు ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. విషయం తెలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ..సత్తిబాబు, రమణ ఇళ్లను పరిశీలించారు. వారిళ్లపై టీడీపీ జెండాలు ఉండడంతో అధికారులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story