Mon Dec 23 2024 03:55:15 GMT+0000 (Coordinated Universal Time)
అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు : వసంత
తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను నియమించినట్లు వార్తలను నమ్మవద్దని కోరారు
తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ ను నియమించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఒక ప్రకటనలో తెలిపారు. మైలవరం శాసనసభ్యుని వారి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.కొందరు సామాజిక మాధ్యమాల్లో పదే పదే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా నియమించినట్లు పోస్టు చేస్తున్నారని, ఇందులో వాస్తవం లేదని పేర్కొంది.
తాను మైలవరం ఎమ్మెల్యేగానే...
దయచేసి ఇకపై ఎవరూ ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఏదైనా ప్రచారం చేసే ముందు ఒకసారి ఎమ్మెల్యే వివరణ కోరితే బాగుంటుందని తెలిపింది. అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని కోరింది. తాను మైలవరం ఎమ్మెల్యేగానే ఉన్నానని, తనకు అధినాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపింది.
Next Story