Mon Dec 23 2024 07:15:01 GMT+0000 (Coordinated Universal Time)
కిల్లర్ ఫీవర్స్.. నెలరోజుల్లో నలుగురు విద్యార్థులు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అంతుచిక్కని కిల్లర్ ఫీవర్స్ విద్యార్థులను బలి తీసుకుంటున్నాయి
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అంతుచిక్కని కిల్లర్ ఫీవర్స్ విద్యార్థులను మృత్యు ఒడికి చేరుస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో నలుగురు విద్యార్థులు నెలరోజుల వ్యవధిలో అంతుచిక్కని వ్యాధితో మరణించారు. మరో 50 మంది విద్యార్థులు జ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అటు పాఠశాల యాజమాన్యంపై, ఇటు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతుచిక్కని వ్యాధి....
విద్యార్థులకు ముందు మామూలు జ్వరంగానే ఉన్నప్పటికీ.. తగ్గిపోతుందనుకునే లోపే ఫీవర్ పెరిగిపోయి చనిపోతున్నారు. తమ పిల్లలకు ఏం రోగం వచ్చిందో తెలియక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. అది కరోనా జ్వరమా లేక.. డెంగ్యూ, మలేరియాకు సంబంధించిందా తెలుసుకుందామంటే.. ఆయా టెస్టులు చేసే కిట్లు లేవని వైద్య సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఒకవేళ పాఠశాలలో పెట్టే భోజనం వల్ల విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారేమోనన్న అనుమానంతో తల్లిదండ్రులు పాఠశాలను మూసివేయించారు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో పై అధికారులు వచ్చి పరీక్షిస్తే గానీ అసలు విషయం తెలిసే అవకాశాలు కనిపించడం లేదు
Next Story